‘జాక్‌’తో వస్తున్న సిద్ధు జొన్నలగడ్డ

Feb 7,2024 19:05 #movie, #siddu

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘జాక్‌’ టైటిల్‌తో ఈ సినిమా రానుంది. ‘కొంచెం క్రాక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. జొన్నలగడ్డ పుట్టినరోజు స్పెషల్‌గా బుధవారం టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలచేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే అప్‌డేట్స్‌ ఉంటాయని మేకర్స్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.

➡️