బుల్లితెర నటుడు వీరభద్రరావు మృతి

Mar 29,2024 19:20 #movie, #veerabhadrarao

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు వీరభద్రరావు చనిపోయారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. టీవీ సీరియల్స్‌, సినిమాలు ఎన్నో పాత్రలు చేసిన ఆయన మరణం పట్ల సినీ ప్రముఖుల, టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️