బెంగుళూరులో ‘మెగా’ సంక్రాంతి సంబరాలు

Jan 14,2024 09:32 #movie, #Ram Charan

చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరుకు సంక్రాంతి పండుగను జరుపుకోవటానికి వెళ్లారు. తన కుమారుడు, హీరో రామ్‌చరణ్‌ ఆయన సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకార తదితరులు ఉన్నారు. క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన తొలిపండుగ కావటంతో మెగా కుటుంబ సభ్యులంతా ఈ పండుగను ఒక్కచోటే ఘనంగా చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్‌లో కాకుండా బెంగుళూరులోని ఫామ్‌హౌస్‌లో సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌ దంపతులు, అకీరానందన్‌ తదితరులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. గేమ్‌ ఛేంజర్‌లో రామ్‌చరణ్‌; మరో సినిమాలో చిరు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పండుగ కావటంతో మెగా హీరోలు, వారి కుటుంబమంతా కలిసి ఈ సంక్రాంతి జరుపుకోనున్నట్లుగా సమాచారం.

➡️