హనుమాన్‌కు అరుదైన రికార్డు

Feb 3,2024 19:05 #movie, #teja

సంక్రాంతి పండుగకు విడుదలైన హనుమాన్‌ సినిమా వసూళ్లలో అరుదైన ఘనతను సాధించింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మొదటిస్థానంలో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో హనుమాన్‌ చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల టాలీవుడ్‌ ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది’ అని పేర్కొంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.278 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రానుంది. రాముడు పాత్రలో మహేష్‌బాబు, మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ లేదా చిరంజీవిని ఎంపిక చేసే అవకాశం ఉందని దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఇటీవల చెప్పారు. ఈ సినిమాలో కూడా తేజ ఉంటారని తెలిపారు.

➡️