సాయి కార్తీక్‌ నిర్మాతగా ‘100 క్రోర్స్‌’

May 7,2024 19:15 #movie, #sai karthik

సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ నిర్మాతగా మారి ఓ సినిమా రూపొందిస్తున్నారు. దివిజా కార్తీక్‌, ఎస్‌.ఎస్‌.స్టూడియోస్‌ బ్యానర్‌ మీద 2016లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్‌’ అనే సినిమాను సాయి కార్తీక్‌ నిర్మించారు. విరాట్‌ చక్రవర్తి కథ అందించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్‌, చేతన్‌, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్‌ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. దర్శకులు వీర శంకర్‌, మల్లిక్‌ రామ్‌, నిర్మాత హర్షిత్‌ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

➡️