జేఎన్‌యూకు వ్యతిరేకంగా మరో సినిమా

Mar 13,2024 13:52 #Communalism, #Film Industry, #JNU

దాదాపు మూడున్నరేళ్ల తర్వాత విద్యార్థి ఉద్యమ ఒత్తిడి మేరకు మార్చి 22న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే, మంగళవారం ‘జేఎన్‌యూ: జహంగీర్‌ నేషనల్‌ యూనివర్శిటీ’ పేరుతో ఓ సినిమా పోస్టర్‌ నెట్‌ లో విడుదల కావడం కలకలం రేపింది. వినయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ బోడ్కే, పీయూష్ మిశ్రా, ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం, అపనిందలు వ్యాపింపజేస్తూ… గతంలో ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ వంటి సినిమాలు డంప్ చేసినట్లుగానే, ప్రజల మధ్య విభేదాలను పెంచడానికి, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడానికి ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ”బస్తర్‌” అనే సినిమా కూడా జెఎన్‌యు వామపక్ష ధోరణిపై దాడి చేసింది. దేశంలోనే మొదటి ర్యాంక్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలకు, బోధనకు పేరుగాంచిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి మచ్చ తెచ్చడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం. దేశంలోని ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం వంటి వాటి నుంచి సామాన్య ప్రజల దృష్టిని మరల్చేందుకు సంఘ్‌పరివార్‌, బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

➡️