వెంకటేష్‌ చిత్రానికి ఆడిషన్స్‌

వెంకటేష్‌, అనిల్‌రావీపూడి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం నుండి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ మూవీలో నటించే ఆర్టిస్టులు కోసం కాస్టింగ్‌ కాల్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేసారు. గోదావరి స్లాంగ్‌ మాట్లాడేవారు కావాలంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో నటించేందుకు పిల్లలు, పెద్దలు కావాలని ఆ పోస్టర్‌లో ప్రకటించారు. ‘ఈ సినిమాపై ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లు VENKYANILO3@ GMAIL.COM లేదా వాట్సాప్‌ 8247812007కి మీకు సంబంధించిన యాక్టింగ్‌ వీడియోలు పంపాలం’టూ ఆ ప్రకటనలో ఉంది. కాస్టింగ్‌ లభించగానే ఈ సినిమా మొదలు కాబోతుందని సమాచారం.

➡️