దర్శకురాలిగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌

May 11,2024 19:05 #movie, #rj swetha

‘పెళ్లి చూపులు’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దొరసాని’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి చిత్రాలను నిర్మించిన బిగ్‌ బెన్‌ సినిమాస్‌ నిర్మాణసంస్థ తమ కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలో ఇప్పటికే తరుణ్‌ భాస్కర్‌, భరత్‌ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్‌ రెడ్డి వంటి పలువురు డైరెక్టర్స్‌ను నిర్మాత యష్‌ రంగినేని పరిచయం చేశారు. తాజాగా మరో డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్‌ కృతి శెట్టికి డబ్బింగ్‌ చెప్పిన ఆర్జే శ్వేత పీవీఎస్‌ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ఈ రోజు (మే 12న) విడుదల చేయబోతున్నారు.

➡️