మే 31న ”గం..గం..గణేశా” రిలీజ్‌

Apr 29,2024 17:54 #movies, #Poster release

”బేబి” వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా ”గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ తన కెరీర్‌ లో చేస్తున్న ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ఇది కావడం విశేషం. ఇవాళ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. మే 31న ”గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

”గం..గం..గణేశా” రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్‌ గన్‌ ఫైర్‌ చేసినప్పుడు ఆ గన్‌ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు పోస్టర్‌ డిజైన్‌ చేశారు. సరికొత్త కంటెంట్‌ తో ఈ సమ్మర్‌ లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ ను ”గం..గం..గణేశా” ఎంటర్‌ టైన్‌ చేయనుంది.

➡️