‘హరోం హర’ పవర్‌ ఆఫ్‌ సుబ్రమణ్యం టీజర్‌

Nov 27,2023 17:36 #movies

హీరో సుధీర్‌ బాబు పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్‌, మమ్ముట్టి, టైగర్‌ ష్రాఫ్‌, విజరు సేతుపతి, కిచ్చా సుదీప్‌లు ‘పవర్‌ ఆఫ్‌ సుబ్రమణ్యం పేరుతో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ‘హరోం హర’ టీజర్‌ను లాంచ్‌ చేశారు.హీరోని పోలీసులు అరెస్టు చేయడంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. అతని మద్దతుదారులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. సుబ్రమణ్యంగా సుధీర్‌ బాబు సాధారణ వ్యక్తి, కానీ పరిస్థితులు అతన్ని హింసాత్మక మార్గంలో నడపవలసి వస్తుంది. కథాంశాన్ని రివిల్‌ చేయకుండా, అన్ని ప్రధాన పాత్రలను, సినిమా ప్రిమైజ్‌ ని ఆకట్టుకునేలా అద్భుతంగా టీజర్‌ ప్రెజెంట్‌ చేసింది. 2024 ప్రారంభంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానున్న ప్రాజెక్ట్‌ పై ఈ టీజర్‌ చాలా ఎక్సయిట్మెంట్‌ ని క్రియేట్‌ చేసింది.

➡️