రక్షణ కోసం రంగంలోకి..

May 12,2024 23:44 #movie, #payal rajputh

‘ఆర్‌ఎక్స్‌100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనకంటూ
ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘రక్షణ’. రోషన్‌, మానస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌
పాత్రలో మెప్పించబోతున్నారు. ఈ మూవీ శరవేగంగా రూపొందుతోంది.
హరిప్రియ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రణదీప్‌ ఠాకోర్‌ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు పాయల్‌ రాజ్‌పుత్‌ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ గురించి దర్శక, నిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌ మాట్లాడుతూ, ”రక్షణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ మిస్టరీ డ్రామా. పాయల్‌ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. రాజీవ్‌ కనకాల, వినోద్‌ బాల, శివన్నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

➡️