త్వరలో కిరణ్‌ అబ్బవరం పెళ్లి..!

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో నటుడిగా ఆయన ఇండిస్టీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్‌గా రహస్య గోరక్‌ నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్‌’, ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాల్లో కిరణ్‌ నటించారు. ప్రస్తుతం ‘దిల్‌ రుబా’, మరో పీరియాడిక్‌ మూవీ చేస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ తర్వాత ‘షర్బత్‌’ అనే తమిళ చిత్రంలో రహస్య నటించార ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో ఈనెల 13న నిశ్చితార్థం జరగనుంది.

➡️