మే 3న ”ఆ ఒక్కటి అడక్కు” విడుదల

Apr 15,2024 18:11 #allari naresh, #New Movies Updates

కామెడీ కింగ్‌ అల్లరి నరేష్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్టైనర్‌ ఆ ఒక్కటి అడక్కుతో ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ నవ్వుల జల్లులు కురిపించింది. సినిమాపై అంచనాలు పెంచింది. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. భరత్‌ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న ఆ ఒక్కటి అడక్కు విడుదల కానుంది. టాలీవుడ్‌ బిగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ హౌస్‌ ఏషియన్‌ సురేష్‌ ఎంటర్టైన్మెంట్‌ ఎల్‌ఎల్‌పి, తెలంగాణకు సంబందించిన థియేట్రికల్‌ హక్కులను పొందింది. తెలుగు రాష్ట్రాల్లో వారి బ్యాకప్తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుంది.

➡️