ప్రభాస్‌ కొత్త సినిమా తాజా కబురు

Jan 13,2024 19:05 #movie

ప్రభాస్‌, మారుతి కాంబోలో వస్తున్న చిత్రం ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న రిలీజ్‌ చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ టైమ్‌ని తెలిపేందుకు సింబాలిక్‌గా కోడిపుంజు కూస్తున్న పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌ ఇప్పటి వరకు కనిపించని ఓ కొత్త లుక్‌లో, క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని చిత్రబృందం పేర్కొంటోంది. పీపుల్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్‌ కూఛిబట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

➡️