గ్రంథాలయం జ్ఞాన భాండాగారం

Nov 24,2023 10:02 #Jeevana Stories

పిల్లలూ, గ్రంథాలయాలు ఎంత ముఖ్యమైనవో తమ కవితల్లో, రచనల్లో ఈ చిన్నారులు తెలియ జేశారు. అవేంటో చూద్దామా?జ్ఞాన సంపదలుఎంతో ప్రశాంతమైన గ్రంథాలయం తెలివినిచ్చే పుస్తకాల యం మనుషులందరికీ ఇది వరం అదే మన గ్రంథాలయంమంచిని నేర్పే గది చెడుని వదలమని చెప్పేది వందల పుస్తకాలు ఉండే గది ఆంగ్లంలో అంటారు లైబ్రరీ తెల్లదొరల నుండి వచ్చింది స్వతంత్రం మాకు గ్రంథాలయం నుండి వచ్చింది జ్ఞానం- వై పూజిత, 6వ తరగతి.నాకు చాలా ఇష్టంగ్రంథాలయం వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గ్రంథాల యంలో ఎన్నో నీతి కథలు, ఎన్నో సంవత్సరాల పూర్వం జరిగిన మనుషుల చరిత్ర, మన స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల గురించి ఎన్నో నేర్చుకోవచ్చు. మామూలు గా లోకమంతా శబ్దాలతో నిండి ఉంటుంది. కానీ, గ్రంథాలయంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే మా బడి గ్రంథాలయం అంటే నాకు చాలా ఇష్టం.- పి. జాహ్నవి, 6వ తరగతి,అరవింద హైస్కూల్‌, కుంచనపల్లి.

➡️