జీవ జలం

Mar 28,2024 05:45 #jeevana

మానవ మనుగడకు
మూలాధారం
సృష్టి గతులకు ప్రాణాధారం
జీవ జలమే కదా మనకు ఆధారం
జీవకోటి మనుగడకే ఇది సాకారం

బీడు భూములకు ఆధారం
పాడి పంటలకు ఇది శ్రీకారం
సలిలమే కదా శరణ్యం
ప్రాణ కోటికిది సుఫలం

నీటి వృథా చేయం చేయం
అనవసరంగా పారబోయం
వృథా నీటిని అరికడదాం
జలాన్ని పొదుపుగా
వాడుకుందాం

నీటి విలువను తెలుసుకుందాం
భావితరాలకు నిలువ వుంచుదాం
నీటిని గుంటలో ప్రవేశపెడదాం
భూగర్భ జలాన్ని పెంపొందించుదాం

నీటి సంరక్షణే మన ధ్యేయంగా
స్వార్థ చింతన విడనాడుదాం
చుక్క చుక్కను పొదుపు చేద్దాం
వర్షం నీటిని ఒడిసి పడదాం

జలం విలువ తెలుసుకుందాం
అవసరానికే వాడుకుందాం
స్వచ్ఛ జలాన్ని నిలుపుకుందాం
భవితవ్యానికి ఆసరా అవుదాం

శక్తి వనరే నీరని చాటుదాం
చేయి చేయి కలుపుదాం
ప్రాణకోటిని సంరక్షిద్దాం
పురోగతిని సాధిద్దాం

సామాజిక బాధ్యతతో సాగుదాం
స్వాలంబనగా కదులుదాం
జీవ నదులను పొంగిద్దాం
పచ్చని జగతికి అడుగులేద్దాం

సాగు నీటి ఇక్కట్లను తీర్చేద్దాం
తాగునీటి కలుషితాన్ని అరికడదాం
కర్తవ్య దీక్షతో కదులుదాం
జలసిరులను కాపాడుకుందాం!
ా నెల్లుట్ల సునీత,
79894 60657

➡️