మజ్జిగతో ఎంతో మేలు..

Feb 18,2024 07:08 #Food, #Jeevana Stories
Buttermilk is very useful..

రోజు మొత్తం మీద ఒక గ్లాసు చల్లని మజ్జిగను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మజ్జిగ చక్కని పరిష్కారం.

  • మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్‌ బి అధికంగా ఉండి శరీరానికి పోషకాలు లభిస్తాయి.
  • మజ్జిగలో ప్రోబయోటిక్‌ వంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను పెంచి, మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
  • రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట, అసిడిటి సమస్యలు తగ్గుతాయి.
  • మజ్జిగలో కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి వంటి పదార్థాలను చేర్చి తాగడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.
  • పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు గ్లాసు మజ్జిగలో అల్లం లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
  • డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.
  • మజ్జిగ వల్ల శరీరంలోని కొవ్వు శాతం కంట్రోల్‌ అయ్యి రక్త ప్రసరణ (బి.పి) తగ్గుతుంది.
  • మజ్జిగలో ఉండే బయో యాక్టివ్‌ ప్రోటీన్‌, యాంటీ క్యాన్సర్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది.

 

➡️