చిలకమ్మా! చిలకమ్మా!

Jan 2,2024 10:06 #feature

చిలకమ్మా చిలకమ్మా

చిటారు కొమ్మన చిలకమ్మా

ఆకుపచ్చని చిలకమ్మా

అందమైన చిలకమ్మా

 

రివ్వున ఎగిరే చిలకమ్మా

చక్కని పలుకుల చిలకమ్మా

ఎర్రని పెదవుల చిలకమ్మా

ఎంతో చక్కని చిలకమ్మా

 

ఆకాశంలో చిలకమ్మా

అందమైన చిలకమ్మా

చిలిపి పలుకుల చిలకమ్మా

రామచక్కని చిలకమ్మా

 

నీ రూపం అపురూపం

నీ పలుకు అద్భుతం

చిలక పలుకుల చిలకమ్మా

చిలక కొట్టుడు చిలకమ్మా

– ఎల్‌. ప్రఫుల్ల చంద్ర 6300546700

➡️