కుష్ఠు నిర్మూలన కోసం …

Jan 30,2024 10:26 #eradication, #feature, #leprosy

               దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ కుష్ఠు వ్యాధి నిర్మూలన పూర్తిగా సాధ్యం కావటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఏటా జనవరి 30న ప్రపంచ కుష్ఠు వ్యాధి అవగాహనా దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు అనేక దేశాల్లో ఈ రోజున కుష్ఠు వ్యాధి నిర్మూనలకు అవగాహనా కార్యక్రమాలు జరుగుతాయి.

వాతావరణంలో సామాన్యంగా కన్పించే మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి వస్తుంది. రోగనిరోధక వ్యవస్థలో మార్పులు, వాపు కూడా తీవ్రతను పెంచుతాయి. వ్యాధి సోకిన వ్యక్తికి దీర్ఘకాలం దగ్గరగా ఉండటం, ఆ బ్యాక్టీరియాతో కలుషితమైన గాలిని పీల్చుకోవటం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చర్మం, శ్వాసకోశ వ్యవస్థ, కళ్లు, నరాలు బాగా ప్రభావానికి గురౌతాయి. మెదడు, వెన్నుపాము వెలుపల ఉన్న నరాలు కూడా ప్రభావితం అవుతాయి. ఈ రోగులతో కలిసి భోజనం చేయటం, వారితోపాటు కూర్చోవటం ద్వారా వ్యాధి సోకదు.

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం ద్వారా ఈ వ్యాధిని సులభంగా తగ్గించుకోవచ్చు. కౌగిలింత, కరచాలనం, లైంగిక సంపర్కాల ద్వారా ఈ వ్యాధి రాదు. గర్భిణికి ఈ వ్యాధి వస్తే పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి రాకుండా చేయటానికి చికిత్స అందుబాటులో ఉంది. ఈ వ్యాధి వచ్చిన వారికి పాదాలు, వేళ్లు పనిచేయవనే అపోహ ఉంటుంది. అదేమీ నిజం కాదు. బ్యాక్టీరియాతో చేతివేళ్లు, కాలివేళ్లుగా తిమ్మిరిగా ఉంటాయి. చికిత్స తీసుకుంటే త్వరగానే నయమవుతాయి. చికిత్సా పద్ధతులుకుష్టుని పాసిబాలసిల్లరీ లెప్రసీ (నెగిటివ్‌ స్మియర్లు), మల్టిబాసిల్లరీ లెప్రసీ (పాజిటివ్‌ స్మియర్లు)గా వర్గీకరిస్తారు. లెప్రసీ సమస్య పైకి కన్పించే లక్షణాలు కలిగివుంటుంది. చికిత్సల్లో డాప్సోన్‌, క్లోఫాజైమిన్‌, రిఫాంపసిన్‌ పద్ధతులు ఉంటాయి. తిమ్మిరిని ఎదుర్కోవటానికి, పాదాలను రక్షించే, ప్రత్యేక బూట్లను వాడాలి. ఏడాది కాలంలోనే చికిత్సల ద్వారా వ్యాధిని నయం చేయొచ్చు.

లక్షణాలు ఎలాగుంటాయంటే..

  • చర్మంపై కందిన, రంగు మారినట్లుగా మచ్చలు
  • తేలికపాటి తిమ్మిరులు
  • క్షీణించిన, వాడిపోయిన గాయాలు
  • చర్మంపై బొడిపెలు
  • పొడిబారిన, గడ్డిబడిన చర్మం
  • చర్మంపై బొడిపెలు
  • అరికాళ్లలో పుండ్లు
  • ముఖం లేదా చెవులపై గడ్డలు
  • కనురెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతింటాయి.
  • కండరాల్లో బలహీనత
  • చెమట పట్టకపోవటం
  • ప్రభావిత ప్రాంతంలో పక్షవాతం
  • ఆఖరి దశల్లో చేతికాలి వేళ్లు చిన్నగా మారతాయి.
  • పాదంపై పుండ్లు మానకుండా ఉంటాయి.

    - డాక్టర్‌ పిఎస్‌ శర్మ, మెడికల్‌ ఆఫీసర్‌, బ్లడ్‌ సెంటర్‌, కిమ్స్‌, అమలాపురం, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా.
    – డాక్టర్‌ పిఎస్‌ శర్మ, మెడికల్‌ ఆఫీసర్‌, బ్లడ్‌ సెంటర్‌, కిమ్స్‌, అమలాపురం, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా.
➡️