భావి భారత పౌరులం

May 15,2024 04:59 #chinnari, #jeevana, #kavithalu

బాలలం మేము బాలలం..
పాలబుగ్గల పసివాళ్లం
అమ్మానాన్నలకు ఆశాజ్యోతులం
భావితరానికి పునాదిరాళ్లం

బాలలం మేము బాలలం..
చాచా నెహ్రూకి ప్రియమైన చిన్నారులం
కల్లాకపటం ఎరుగని నిర్మల మనస్కులం
మోసాలు, ద్వేషాలు తెలియని అమాయకులం

బాలలం మేము బాలలం.
క్రమశిక్షణలో మెలిగే విద్యార్థులం
ఆటపాటలతో అలరారే చలకీ పిల్లలం
సెలవుల్లో విహారాలు చేసే సరదాగాళ్లం

బాలలం మేము బాలలం..
భరతమాత ముద్దు బిడ్డలం
నవభారత నిర్మాణానికి భాగస్వాములం
భావి భారత పౌరులం

– పి. వర్షిక,
7వ తరగతి, సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌, సికింద్రాబాద్‌,
95505 25130.

➡️