సందడి చేద్దాం..!

Dec 17,2023 12:04 #Jeevana Stories

పూల వనంలో పువ్వుల్లా

రండోయ్.. సందడి చేద్దాం

నాట్యం చేసే నెమళ్ళుల్లా

రండోయ్.. సందడి చేద్దాం

గానం చేసే కోయిలల్లా

రండోయ్.. సందడి చేద్దాం

మాటలు నేర్చిన చిలుకల్లా

రండోయ్.. సందడి చేద్దాం

పూలపై వాలే తుమ్మెదల్లా

రండోయ్.. సందడి చేద్దాం

చిటపట కురిసే చినుకుల్లా

రండోయ్..సందడి చేద్దాం

మిలమిల మెరిసే తారల్లా

రండోయ్..సందడి చేద్దాం

గలగల పారే సెలయేరుల్లా

రండోయ్..సందడి చేద్దాం

గబగబ బడికెళ్ళే పిల్లల్లా

రండోయ్..సందడి చేద్దాం

– కయ్యూరు బాలసుబ్రమణ్యం, 77802 77240.

➡️