జనంతో కలిసి ప్రభుత్వ విద్యను నిలబెడద్దాం

కామన్ విద్యా విధానం ద్వారానే పేదలకు మెరుగైన విద్య
శేషగిరి 3 వ వర్ధంతి సభలో విఠపు.బాలసుబ్రమణ్యం
మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యాపార విధానంలో జనంతో కలిసి ప్రభుత్వ విద్యను, బడులకు కాపాడుకోవడం ద్వారానే పేదలకు విద్యా  అందుతుందని.. అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ మాజీ పిడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ విఠపు.బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. సోమవారం యు టి ఎఫ్ ఉద్యమ నేత కోరెడ్ల శేషగిరి మాష్టర్ 3వ వర్ధంతి సందర్భంగా స్మారకోపాన్యాసం చేశారు. ముందుగా శేషగిరి మాష్టర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శేషగిరి మాష్టర్ 3వ వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో స్మారకోపన్యాసం చేస్తూ ”విద్యారంగంలో పరిణామాలు సవాళ్లు, కర్తవ్యాలు”పై ప్రసంగించారు. శేషగిరి మాష్టర్ స్మారకపోన్యాసం చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఏ కోణంలో చూసిన పరిణితి కలిగిన నాయకత్వం లక్షణం కలిగిన వ్యక్తి శేషగిరి అన్నారు. శేషగిరి విజ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు విరాళాలు ఇచ్చి నిర్మాణం చేయడంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు. అధి శేషగిరికి దక్కడం గర్వంగా ఉందన్నారు. నివాళి అర్పించడమంటే సంఘ నిర్మాణం బలోపేతం చేయడమేనన్నారు. శేషగిరిని సంఘ నిర్మాణ రూపంలో చూడాలన్నారు. క్రియాశీలకంగా, సమాజ నిర్మాణం కోసం ఉద్యమం నిర్మాణం జరగాలన్నారు. ఉపన్యాసం అనేది ఆచరణలో కార్యరూపం దాల్చితేనే దానికి సార్థకత అన్నారు. ఇటీవల విద్యా శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో 70, 80 శాతం ఫలితాలు వచ్చాయి అనేది కాదు మొత్తం విద్యార్థుల్లో సంఖ్య కాదు మొత్తం విద్యార్దులకు వచ్చే మార్కులను బట్టి లెక్క వేయాలని పేర్కొన్నారన్నారు. ఆ లెక్కన ప్రభుత్వ పాఠశాలల ప్రైవేటు పాఠశాలలు కంటే తక్కువుగా ఫలితాలు ఉన్నాయనీ ఆయన ఆన్నారు. ప్రిన్సిపుల్ కార్యదర్శి విద్యా రంగంలో ఉన్న తీవ్రమైన అసమానతలు ఉన్నాయి, వాటిని సరిచేయమని చెబితే బాగుండేదన్నారు. ఇటీవల అజిమ్ ప్రేమ్ ఫౌండేషన్ వారు సర్వే చేయడం జరిగిందన్నారు. వారి సర్వే ద్వారా చెప్పింది ఏమిటి అంటే ప్రైవేటు పాఠశాలలో పిల్లలు సామాజిక, ఆర్ధిక కలిగిన పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో ఉన్నవారు పేదలు పిల్లలకు, విద్యా విధానం పిల్లలు కేంద్రంగా జరగడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలలో తల్లి తండ్రులు కేంద్రంగా విద్యా విధానం జరుగుతుందన్నారు. గణిత జ్ఞానం చూసినట్లు అయితే ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు మెరుగ్గా ఉన్నారనే సర్వేలో చెప్పడం జరిగిందన్నారు. గణిత్తాన్నీ జీవితానికి అప్లై చేయడంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్న విద్యార్థుల్లో మెరుగ్గా ఉన్నారన్నారని సర్వేలో పేర్కొనడం జరిగిందన్నారు. ప్రపంచంలో ప్రైవేటు పాఠశాలలు చదివిన పిల్లలు 12 శాతం ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేదరికంలో ఉన్న వారు చదువుతున్న విద్యార్దులు 42 శాతం మంది ఉన్నారని బ్రిటిష్ కౌన్సిల్ సర్వేలో చెప్పడం జరిగిందన్నారు. బెస్ట్ స్కూల్ విద్యా విధానం అమలు జరుగుతున్న దేశం శ్రీలంక అన్నారు. మనది రామరాజ్యం అనే మన దేశంలో ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి చదివిన రావణాసురుడు కలిగిన దేశం అనే శ్రీలంకలో 6వ తరగతి విద్యార్ది సామర్థ్యంతో సమానం ఇది మన విద్యా విధానం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. నిరుపేదలు మాత్రమే చదువుకునే పాఠశాలలు ఉంటే వాళ్లకు ఏమి కావాలో వారు అడగలేరు. ఇటువంటి విద్యా వ్యవస్థలో అభివృద్ది ఉండదన్నారు. విద్యార్ది బడి మానేసిన తర్వాత ఆయను తెలుసుకున్న జ్ఞానమే విద్యా అన్నారు. విద్యార్ది చదివిన తర్వాత వాడికి ఏమి తెలిసి ఉండాలి అంటే సమాజం మీద అవగాహన కలిగిన విద్యా నేర్చుకొని ఉండాల్సిన విద్యా ఉండాలన్నారు. జన్యు పరంగా మనం అందరు ఒకటే అనే జ్ఞానం కలిగితే అది నిజమైన విద్యా అన్నారు. థామస్ పీకేట్ అనే వ్యక్తి చేసిన సర్వేలో దేశంలో ఒక్క శాతం చేతిలో దేశ సంపద 40 శాతం ఉందన్నారు. 50 శాతం మంది దగ్గర 7 శాతం మాత్రమే సంపద ఉందన్నారు. దేశంలో 80 స్కూళ్లలో నున్న ఐబీ నేడు ప్రభుత్వ స్కూళ్ళలో పెడతామని చెప్పడమంటే అధి జరగని పని అన్నారు. దేశంలో ఇన్ని రకాలైన అసమానతలు ఉన్నవి. తరతరాలుగా కొంతమంది దగ్గర జ్ఞానం ఉంది. ఉత్పత్తి చేసే వారి దగ్గర జ్ఞానం లేదు. అందరికీ విద్యా కావాలి. అందరూ ఒకే గొడుకు కింద చదివించే కామన్ విద్యా విధానం అవసరమన్నారు. కామన్ విద్యా విధానం ద్వారానే సమానత్వ భావనలకు ఆస్కారం ఉంటుందన్నారు. కామన్ విద్యా విధానం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇది ఇక్కడ అమలు జరగాలన్నారు. కామన్ విద్యా విధానం ద్వారానే అంతరాలు లేని సమాజం రూపకల్పన జరుగుతుందన్నారు. మనంగా ఉపాద్యాయులు,సమాజం కామన్ విద్యా విధానం అమలుకు సిద్దంగా ఉన్నామా అనేది ప్రశ్నగా ఉందన్నారు. నేడు విద్యావిధానం కులాలు పేరుతో పాఠశాలలు ఏర్పడటం, హేయంగా విద్యా విధానం ముక్కలు ముక్కలుగా మారిపోయిందన్నారు. కల్చర్ వ్యవహారంగా మారిపోయిందాన్నారు. ఆర్థికంగా కాకుండా ఆలోచనలో పైకి పోవాలని అనుకోవడం వలన విద్యా విధానం తయారైందన్నారు. కల్చర్ విద్యా విధానం లో మార్కులే ప్రామాణికంగా మారిపోవడం బాధాకరమన్నారు. మార్కులు మాత్రమే వ్యవస్థ ఆమోదించిడం అంటే పేద పిల్లలకు చాల నష్టం జరుగుతుందన్నారు. ఉపాద్యాయులు మీ స్కూల్లో ఉండే పిల్లల్ని అధ్యయనం చేసి,వారి సామాజిక,ఆర్ధిక స్థితిగతులు విచారించాలి అన్నారు. సమగ్ర శిక్షా వాళ్ళు కృష్ణ జిల్లాలో సర్వే చేస్తే 9 వ తరగతి నుంచి బాలురు ఎక్కువ మంది బడి మానేసి పనులకు వెళ్లిపోతున్నారు, బాలికలు విద్యను కొనసాగిస్తున్నారు అనేది తేలింది. చాలా బాధాకరమైన పరిస్తితి నేడు ఉంది దీన్ని ఉపాద్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా విధానంలో పథకాలు విధానం అమలులోకి వచ్చిందన్నారు. పిల్లల్ని భ్రమ పెట్టీ,మోసం చేసి, చదువూ రాకుండా చేసే డ్రామా రాజకీయాలు నేడు మన రాష్ట్రంలోజరుగుతుందన్నాయన్నారు. కేరళలో ప్రైమరీ స్కూల్ లో తర్గతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రతి ప్రైమరీ స్కూల్ లో నాలుగు తరగతులు ఉన్నాయన్నారు .దేశంలో ఆదర్శవంతమైన విద్యా విధానం కేరళలో అమలు జరుగుతుందన్నారు.
నేడు మన రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ప్రైవేటు విద్యా విధానంలో జరుగుతుందన్నారు. వ్యాపార వేత్తలు డిల్లీలో సమావేశమై ఎక్కువ లాభం వచ్చే అవకాశం విద్యా రంగం ద్వారా వస్తున్నాయని నిర్ణయానికి వచ్చాయంటే విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందన్నారు. నేడు మన రాజకీయ నాయకులలో 60 నుంచి 70 శాతం మందికి విద్యా వ్యాపార సంస్థలు ఉన్నాయన్నారు. నేడు ప్రైవేటు విద్యా వ్యాపారవేత్తలు ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా అన్నారు. రాష్ట్రంలో 1200 పాఠశాలలు ఏకోపద్యాయ పాఠశాలలు ఉన్నాయంటే ఇంత దారుణమైన పరిస్తితి ఎలా ఉంది ఉపాద్యాయులు గ్రహించలన్నారు. ఇవన్నీ మూతపడటం ఖాయమన్నారు.
సాల్ట్ ఒప్పందం మేరకు ఉపాధ్యాయులకు వేతనాలు అయినా తగ్గించాలి లేదంటే ఉపాద్యాయులు సంఖ్యను అయినా తగ్గించాలని చెప్పడం జరిగింది. దీంతో 26 వేలు పోస్టులు ఒక నిర్ణయంతో లేపేయడం జరిగిందన్నారు. ఉపాద్యాయులు దీనిని పట్టించుకోకపోతే మనకి సంబంధం లేకుండా విద్యా విధానం నుంచి విడిపోవడం ఖాయం అన్నారు. గత ఏడాది ప్రభుత్వ బడుల్లో 3,59,000 విద్యార్దులు తగ్గి పోవడం జరిగిందన్నారు.
పేదలకు చదువు చెప్పే ప్రభుత్వ బడి లేకపోతే మనం ప్రజలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. మన గౌరవాన్ని, భవిష్యత్ ను నిర్ణయించేది బడి పిల్లలు మాత్రమే. వాళ్ళకి నమ్మకం పోతే మనం అన్యాయానికి గురవువుతామన్నారు. మనం, జనం బడి చుట్టూ చేతులు కలుపుకొని నిలబెట్టే విధంగా ఉండాలన్నారు. దీర్ఘకాలికంగా విద్యావిధానం అవసరం. దాన్ని కోసం శేషగిరి అందించిన స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలకు, ప్రభుత్వ విద్యను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలన్నారు.

అనంతరం యు టి ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలను మనకి చూపిస్తూ మన మధ్య లేకుండా పోయారు. ఎన్నాళ్ళు ఉన్నాం అనే దానికంటే ఎంత మంది మదిలో ఉన్నమనేది ముఖ్యం. అధి శేషగిరిలో కనిపిస్తోందన్నారు. శేషగిరి నీ స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం మనం ఆలోచిస్తే సమాజం మన కోసం ఆలోచిస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయలతో కలిసి సెమినార్లు పెట్టీ వస్తున్న మార్పులపై అవగాహన పెంచే ప్రయత్నంలో ఆయన కృషి మనకి స్ఫూర్తి అన్నారు. ఐక్యతే మన బలం అని నమ్మిన వ్యక్తి అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. రానున్న కాలంలో మన దేశం ముస్లిం దేశంగా మారిపోతుందని చెప్పి మన మద్య వైషమ్యాలను పెంచుతున్నారన్నారు. ఏ రోజు అయితే అందరు సమానమే అని ఆలోచిస్తామో అప్పుడే అభివృద్ది జరుగుతుందన్నారు. ప్రశ్నించే హక్కుతో సమానత్వాన్ని సాధించాలని కోరారు. ఇదే శేషగిరి కి ఇచ్చిన నిజమైన నివాళి అన్నారు. రాష్ర్ట కార్యదర్శి మురళీమోహన్ రావు మాట్లాడుతూ శేషగిరి తో ఉద్యమ సహచారులుగా ఉన్నాం. ఆయన అధికారులను డీ ఈ ఓ అయినా,కలెక్టర్ అయినా మాట్లాడే విధానం, వారిని ఒప్పించే విధానం ఎవరైనా అంగీకరించల్సి తీరాల్సిందే అటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆయనన్నారు. ఐక్య ఉద్యమాలను నడపడంలో దిట్ట శేషగిరి అన్నారు. స్టడీ సర్కిల్స్ నిర్వహించడంలో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేది మన జిల్లా అధి శేషగిరి కృషి అన్నారు. ఐక్య ఉద్యమం నడపడంలో శేషగిరి ఒక మోడల్ గా నిలిచారన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలను నడపడంలో ముందు ఉండాలన్నారు.

శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ ఏ ఆశయంతో పని చేసారో అదే స్పూర్తితో యు టి ఎఫ్ బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఆయనకి మనమిచ్చే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. శేషగిరి విజ్ఞాన కేంద్రానికి పది వేలు విరాళం ప్రకటించారు. బి ఈ డీ కాలేజీ రిటిర్డ్ ప్రిన్సిపల్ శర్మ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాల పుషాలంగా ఉన్న నాలెడ్జ్ కలిగిన వ్యక్తి అన్నారు. నేను విద్యా శాఖలో, జెడ్పీ కార్యాలయంలో పని చేసినప్పుడు ఉపాద్యాయులు సమస్యలు పరిష్కారం చేయించుకోవడంలో శేషగిరి పరిష్కార మార్గం చూపించిన విధానం స్ఫూర్తి దాయకం అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రమేష్ పట్నాయక్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎపి టి ఎఫ్ 257 శ్రీనివాసరావు, పి అర్ టి యు నాయకులు బి.శివప్రసాద్, కే.విజయగౌరి, కే.శ్రీనివాసరావు, డి.రాము జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస, శేషగిరి మాష్టర్ తల్లి సూర్యకాంతం, మన్యం జిల్లా అధ్యక్షులు రమేష్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, శ్రీకాకుళం జిల్లా నాయకులు శేషగిరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సదస్సులో యు టి ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ఉపాద్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️