ఆప్‌ ప్రచార గీతంపై ఇసి నిషేధం : ఢిల్లీ మంత్రి అతిషీ

న్యూఢిల్లీ  :   తమ పార్టీ లోక్‌సభ ప్రచార  గీతంపై  ఎన్నికల సంఘం (ఇసి) నిషేధం విధించినట్లు ఆప్‌ ఆదివారం పేర్కొంది. ఇది అధికార బిజెపి, కేంద్ర దర్యాప్తు సంస్థలను చెడుగా చూపుతోందని తెలిపినట్లు  పేర్కొంది.  ” జైల్‌ కే జవాబ్‌ మే హమ్‌ ఓట్‌ దేంగే ”  లోక్‌సభ ప్రచార గీతాన్ని నిషేధించినట్లు ఆప్‌ మంత్రి అతిషీ తెలిపారు.  ప్రచార గీతంపై  ఇసి నిషేధం విధించడం బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు.  ఆ గీతంలో  బిజెపిని ప్రస్తావించలేదు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించలేదు. వాస్తవ వీడియోలను, ఘటనలను  ప్రస్తావించామని అన్నారు.

” బిజెపి నియంతృత్వంగా వ్యవహరించినప్పటికీ.. దాని గురించి  ప్రతిపక్షాలు మాట్లాడటం   తప్పు.   ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. బిజెపి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై చర్య తీసుకోవాలని, ప్రతిపక్ష పార్టీల ప్రచారాలను ఆపవద్దని ఇసిని కోరుతున్నాను” అని అన్నారు.

రెండు నిమిషాల ప్రచార పాటను ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే రచించి, ఆలపించారు. ఈ ప్రచార పాటను పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.

➡️