పెద్ద పండుగ

Jan 15,2024 08:22 #sahityam

మూలపడిన పాత కలపతో కలిపి

బూజు పట్టిన రోత తలపుల్ని దులిపి

దగ్ధం చేయమంటోంది భోగి

ముచ్చటైన రంగవల్లుల ముంగిట

గంతులేయు గంగిరెద్దుల సాక్షిగా

కొత్త ధాన్యం పరమాన్నం భుజించు వేళ

అన్నదాతని అభినందించమంది సంక్రాంతి

 

తోడు నిలిచి పాడి నొసగు

పసిడి మనసుల పశు గణమును

పూజింప వచ్చిన కనుమ పండుగ

అనుదినమూ ఇదే రీతి

శ్రమను గౌరవించు సంస్క ృతి

రక్ష కాగలదని చెప్పె నీతి !

– డా. డి వి జి శంకరరావు, మాజీ ఎంపీ9440836931

➡️