అక్షరాలతో ఆట పాట..

May 5,2024 08:58 #Sneha

పిల్లలకు సెలవులిచ్చేశారు. కానీ వారు సెల్‌ఫోన్‌తోనే కాలం గడపకూడదు. ఇది తల్లిదండ్రులకు కంటక పరిస్థితే. అగమ్యగోచరమే. మరి కొన్ని కొత్త ఆటలు, పాటలతో వారు ఆడుకునేలా చేయగలిగితే.. అలాగే చేద్దాం. పెద్దవాళ్ళు, కొంచెం పెద్ద పిల్లలు ఈ పాట నేర్పితే అచ్చుల వరకూ నేర్చుకున్నట్లే. మరి బుజ్జి కూనలకు ఈ పాట నేర్పేద్దాము రండి.

అ,ఆ,ఇ,ఈ చదవాలి
అన్నీ చక్కగ దిద్దాలి
ఉఊఋౠ నేర్వాలి
ఊయల హాయిగ ఊగాలి
ఎ,ఏ,ఐ అని వ్రాయాలి
ఎన్నో ఊసులాడాలి
ఒఓఔ అని నేర్వాలి
అం అ: అంటూ ఆడాలి.

చూశారా! అందమైన అక్షరాలు.. అచ్చంగా అచ్చులు వచ్చేశాయి!

➡️