స్ఫూర్తిని నింపుదాం..

Dec 31,2023 07:15
inspired by reading books

 

పిల్లలకు మనం ఏమైనా చెబితే వింటారు. కానీ ఆ తర్వాత ఆచరణలో ఎంత వరకు ఉంటారో చెప్పలేం. అంతెందుకు పెద్దవాళ్లం మనమే అలా ఉంటుంటాం. సహజంగా పిల్లలు చూసి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పెద్దలు చేసే పనులు చూసి వాళ్లూ అనుకరిస్తారు. అందుకే పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితిని అనుకూలంగా మలచుకోవాలంటే పెద్దవాళ్ళుగా మనం ముందు ఆచరిస్తే పిల్లలూ అవి అందిపుచ్చుకుంటారు. అలా పిల్లల్లో మనం స్ఫూర్తినీ నింపవచ్చంటున్నారు నిపుణులు.బయట చిరుతిళ్లు పెద్దలు తింటూ పిల్లల్ని తినొద్దని వార్నింగ్‌ ఇస్తే అస్సలు తగ్గేదే లేదంటారు. అందుకనే ముందు పెద్దలు అలాంటి చిరుతిళ్లు కొనుక్కోవడం మానుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మంచి డైట్‌ ప్రణాళికా బద్ధంగా పెద్దలు తీసుకుంటుంటే పిల్లలనూ ఆ వైపు తేలికగా మలచవచ్చు. అలాగే ఇంట్లో ఒకరికొకరు సాయం చేసుకోవడం పెద్దలు చేస్తుంటే పిల్లలూ తమ వంతు సాయం చేస్తారు. అలాంటే తోటపనులు చేస్తుంటే మీతో పాటు పిల్లల్ని ఇన్‌వాల్వ్‌ చేయండి.

  • నేర్చుకోవడం..

ముందు అసలు ఏదైనా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస పిల్లల్లో కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాకాకుండా ‘ఇది నేర్చుకో, అది నేర్చుకో.. అలా చేయొచ్చు కదా.. వాళ్లు చూడు ఎలా చేస్తున్నారో!’ అంటూ ఆదేశాలు జారీ చేయడం, పోలికలు పెట్టడం సరికాదంటున్నారు నిపుణులు. పిల్లలు ఏదైనా, ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు అనే ఆలోచన కలిగించాలంటే.. ముందు పెద్దలు ఆ విధంగా చేస్తుండాలి. అంతేగానీ ‘ఈ వయసులో నేనేం నేర్చుకుంటా!’ అంటూ నిరాశగా మాట్లాడితే.. వాళ్లూ అదే అనుకుంటారు. వస్తున్న మార్పులకు అనుగుణంగా అందిపుచ్చుకోవాలనేది వాళ్ల ముందు ప్రదర్శించగలిగితే.. వాళ్లు తప్పక స్ఫూర్తిని పొందుతారంటున్నారు నిపుణులు.

  • సమాజం వైపు..

మన చుట్టూ జరిగే వాటిని పెద్దలు పట్టించుకోకుండా.. ఎంతసేపు ఇల్లూ, ఆఫీసే లోకంగా గడిపేస్తుంటారు. మన జీవితాన్ని చుట్టూ జరిగే అనేక పరిణామాలే ప్రభావితం చేస్తున్నాయనే స్పృహ కూడా ఉండదు. దీంతో పెద్దలకు బయట జరిగే కార్యక్రమాలు, ఆందోళనల పట్ల ఒకరకమైన పట్టనితనం ఉంటుంది. అవి మన జీవితాలకు ఉపయోపడేవి అనేది వాటిపైన కాస్త దృష్టి పెడితేనే తెలిసేది. అందుకే సమాజం పట్ల మన దృష్టికోణం మార్చుకోవాలి. మనం కూర్చునే ప్రదేశాన్నే పరిశీలిస్తామే, అలాంటిది మన జీవితం మొత్తం గడిపే సమాజం గురించి ఆలోచించకపోతే ఎలా? ఇది పెద్దలుగా మనం ఆవైపు అడుగులు వేస్తే.. పిల్లలూ తమ అడుగులు కలుపుతారని అంటున్నారు నిపుణులు. ప్రతి మనిషికి సామాజికపరమైన బాధ్యత ఉండాలి. అందుకు బాల్యంలోనే బీజం పడితే మంచి పిల్లల్నే కాదు.. మంచి సమాజాన్ని ఇచ్చినవాళ్లవుతారు.సేవా దృక్పథం..మనం కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటే.. అది చూసిన పిల్లలకు తాము అలా చేయాలనే ఆలోచన కలుగుతుంది. అందుకే చిన్నప్పుడే పిల్లలకు అలాంటి మంచి అలవాట్లు అలవాటు చేయాలి. సాటి వారి పట్ల సానుభూతి, ఏదైనా వాళ్ల సహాయపడాలనే ఆలోచన కలిగించగలగాలి. వాళ్ల పుట్టినరోజులకు అనాథ పిల్లలకు ఏదైనా ఇప్పిస్తే.. సేవా దృక్పథం చిన్నప్పటి నుంచే అలవర్చినవాళ్లం అవుతాం. పిల్లలు ఆపదలో ఉన్న ఎవరినైనా ఆదుకోవడం మంచి లక్షణంగా భావిస్తారంటున్నారు నిపుణులు. ఆ విధంగా వారిని తయారుచేయడం అంటే మంచి మనసులు పెంపొందించడమే.

  • అనుభవాలు..

పిల్లలకు మన చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకూ జరిగిన అనుభవాలను పంచుకోవాలి. వాటిని కథలుగా పిల్లలకు అప్పుడప్పుడు సందర్భానుసారం చెప్తుంటే.. పిల్లలు ఆసక్తిగా వినడమే కాదు.. అలాంటి అనుభవాల్లో నుంచి పాఠాలూ నేర్చుకుంటారు. పెద్దలుగా అప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. పిల్లలు అలాంటి తప్పులు చేయకూడదనే విషయాన్ని తెలియజేసేలా చెప్పాలంటున్నారు నిపుణులు. ఇవే కాకుండా.. ఇంట్లో పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలి.. ఇంటికి ఎవరైనా వస్తే ఎలా మర్యాదగా నడుచుకోవాలి.. ఇలాంటివన్నీ పిల్లలకు పెద్దలనుండే అలవడతాయి. ఏదైనా ఆచరణలో చూసిందే పిల్లలు ఎక్కువగా ఆకళింపు చేసుకుంటారు. అందుకే పెద్దలు అప్రమత్తగా.. ఆదర్శవంతంగా ఉంటూ

➡️