ఓ తియ్యని మాట

Feb 18,2024 13:48 #Poetry, #Sneha

దశాబ్దాల ఆవలకి

మనసుకు

వంతెన వేసుకుని బయలు దేరాను

నా నీడ నన్ను ప్రశ్నిస్తోంది

ఎవరికీ లేని బాధ నీకెందుకని

నాలో నిశ్శబ్దం

వేల టన్నులను మోస్తూ

అంతరంగ వేదికపై

నన్ను కూల్చేస్తున్న యాతన

ప్రయాణం

కొనసాగిస్తూనే ఉన్నాను

నాకు నేనే ఎదురవుతున్నాను

అందరికీ ఇలానే ఉందేమో..?

ఆగి..

గుప్పెట్లో విశ్వాన్ని వెదకటం మొదలుపెట్టాను

ఓ తియ్యని మాట వినిపిస్తుందేమోనని

అంతా ఆర్టిఫీషియల్‌ సంభాషణలే

మడం తిప్పాలని లేదు

నాకు నేనుగా

కొన్ని మాటలు చెప్పుకోవడం

మొదలు పెట్టాను

నిజమే

నా నుండే కదా మార్పు రావాల్సింది

దూరంగా ఓ తియ్యని మాట వినిపించింది

నా మనసు నానీడతోనూ

నాతోనూ మాటలు ఆపేటట్టు లేదిక

 

  • కొత్తపల్లి మణీత్రినాథరాజు, 7997826662
➡️