మండే ఎండల్లో జాగ్రత్తలు..

May 12,2024 10:53 #Sneha, #summar, #sun burning

సాధారణంగా పిల్లలు ఆటల్లో పడి, పెద్దవాళ్లు పనుల్లో ఉండి, బాగా దాహమయ్యే వరకూ నీళ్ళు తాగకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. మండే ఎండల్లో ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెమట రూపంలో నీరు బయటికి పోతుంది. దాంతో తలనొప్పి, అలసట, నీరసం కలుగుతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు కడుపులో వికారంగా ఉండటం, వాంతులు, విరోచనాలు అవుతుంటాయి. దీన్నే అతిసార, డీహైడ్రేషన్‌ అంటారు. ఇది ఒక్కోసారి చాలా ప్రమాదంగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ మించిపోయే పరిస్థితి రావడం, గుండె వేగంగా కొట్టుకోవటం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ అని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి.

ద్రవ పదార్థాలు..
ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పళ్ళరసాలు, కొబ్బరినీళ్ళు వంటివి తీసుకుంటుండాలి. ఈ కాలంలో తాటి ముంజెలు దొరుకుతాయి. వీటిని కూడా వీలైనప్పుడల్లా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. కాఫీ, టీలు మానేయటం మంచిది. పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లు రోజూ తినాలి. ధరించే దుస్తులు కూడా లేతరంగుల్లో, కాస్త వదులుగా ఉండేవి, కాటన్‌వి మాత్రమే ధరించటం పిల్లలకూ పెద్దలకూ సౌకర్యవంతం.

➡️