సెమీస్‌ బెర్త్‌ లక్ష్యంగా రేపు నేపాల్‌తో చివరి సూపర్‌-6 మ్యాచ్‌

Feb 1,2024 22:05 #Sports

ఐసిసి అండర్19 వన్డే ప్రపంచకప్‌

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోన్న భారత యువజట్టు నేపాల్‌తో చివరి సూపర్‌6 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణాలతో నిమిత్తం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరనుంది. గ్రూప్‌ాఎలో ఆడి మూడు మ్యాచుల్లో ఘన విజయాలను నమోదు చేసుకున్న యువ జట్టు.. మంగళవారం జరిగిన తొలి సూపర్‌6 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ యువ జట్టుపై ఏకంగా 214 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో గ్రూప్‌-డిలో మూడో స్థానంలో నిలిచి సూపర్‌ 6కు చేరిన పసికూన నేపాల్‌తో శుక్రవారం మ్యాచ్‌ ఆడనుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. యువ క్రికెటర్లు ఆదర్ష్‌ సింగ్‌, ప్రియాన్షు, కెప్టెన్‌ సహారన్‌, ముషీర్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముషీర్‌ ఖాన్‌ న్యూజిలాండ్‌తో తొలి సూపర్‌6 మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. మరోవైపు సౌమీ కుమార్‌, రాజ్‌ లింబనీ, నమన్‌ తివారి బౌలింగ్‌లో చెలరేగుతున్నారు.

➡️