చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్‌

Mar 4,2024 12:34 #2024 ipl, #Cricket, #csk, #Sports

17వ సీజన్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. చెన్నై స్టార్‌ బ్యాటర్‌, ఓపెనర్‌ కాన్వే గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌కు చెందిన కాన్వే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎడమ చేతి బొటన వేలికి గాయం అయింది. దీంతో అతను మ్యాచ్‌ మధ్యలోనే గ్రౌండ్‌ను విడిచి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతనికి సర్జరీ చేయగా.. 8 వారాలైన విశ్రాంతి తీసుకొవాలని డాక్టర్లు సూచించాడు. దీంతో కాన్వే ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ నెల 22న చపాక్‌ స్టేడియంలో చెన్నై, బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

➡️