ఆఫ్ఘనిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా డ్వైన్‌ బ్రేవో

May 21,2024 22:25 #Sports

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ పురుషుల జట్టు బౌలింగ్‌ కోచ్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రేవో ఎంపికయ్యాడు. ఈమేరకు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(ఎఫ్‌సిబి) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆడే జట్టుతో బ్రేవో జత కలవనున్నాడు. ఇక బ్రేవో టి20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు(625) కూల్చిన తొలి బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 295మ్యాచ్‌లు ఆడిన బ్రేవో.. మొత్తం 6423పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 7000పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2024లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు గ్రూప్‌-లో ఉండగా.. ఇదే గ్రూప్‌లో ఉగాండా, న్యూజిలాండ్‌, పపునుగేనియా, వెస్టిండీస్‌ జట్లు ఉన్నాయి.

➡️