అటు ఫ్రేజర్‌.. ఇటు అభిషేక్‌

May 8,2024 08:38 #Sports

ఢిల్లీ క్యాపిటల్స్‌ 221/8
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్‌ పొరెల్‌(65), జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50)లు రాజస్థాన్‌ బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరి అర్ధసెంచరీలకి తోడు చివర్లో స్టబ్స్‌(41) చెలరేగడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు ఫ్రేసర్‌, అభిషేక్‌ 4.1ఓవర్లలో 60పరుగులు చేసి గట్టి పునాది వేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50; 20బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో ఒకటే ఫోర్‌ కొట్టినా.. ఆ తర్వాత సందీప్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌లను ఉతికేశాడు. ఆవేశ్‌ వేసిన నాలుగో ఓవర్లో రెచ్చిపోయిన మెక్‌గుర్క్‌ వరుసగా.. 4, 4, 4, 6, 4, 6 బాది అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫ్రెజర్‌ కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీని కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో మరోదఫా ఫ్రెజర్‌ 20బంతుల్లోనే అర్ధసెంచరీని నమోదు చేశాడు. అశ్విన్‌ ఓవర్లో మెక్‌గుర్క్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడి ఫెరారీ చేతికి చిక్కాడు. దాంతో 60పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాV్‌ా హౌప్‌(1) రనౌట్‌ కాగా.. అక్షర్‌ పటేల్‌(15)ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. ఆ దశలో మరో ఓపెనర్‌ అభిషేక్‌ పొరెల్‌(65) ధాటిగా ఆడుతూ బౌండరీలతో చెలరేగాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(15)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. చివర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌(41; 20బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. చాహల్‌ వేసిన 18వ ఓవర్లో స్వీప్‌ షాట్లతో మూడు ఫోర్లు, ఆఖరి బంతికి సిక్సర్‌ బాది 21పరుగులు పిండుకున్నాడు. గుల్బదిన్‌(19)తో కలిసి 45పరుగులు జోడించారు. సందీప్‌ వేసిన 20వ ఓవర్లో సిక్స్‌ బాది ఢిల్లీకి భారీ స్కోర్‌ అందించాడు. ీ20 వలర్డ్‌ కప్‌ స్క్వాడ్‌కు ఎంపికైన ఉత్సాహంలో చాహల్‌ మరో ఫీట్‌ సాధించాడు. చాహల్‌ ఈ ఫార్మాట్‌లో 350 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ సారథి రిషభ్‌ పంత్‌ వికెట్‌ తీసి చాహల్‌ ఈ మైలురాయికి చేరుకున్నాడు. రాజస్తాన్‌ బౌలర్లలో అశ్విన్‌కు మూడు, చాహల్‌, సందీప్‌ శర్మ, బౌల్ట్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: ఫ్రేజర్‌ (సి)ఫెర్రెరియా (బి)అశ్విన్‌ 50, అభిషేక్‌ పోరెల్‌ (సి)సందీప్‌ శర్మ (బి)అశ్విన్‌ 65, హోప్‌ (రనౌట్‌)సందీప్‌ శర్మ 1, అక్షర్‌ పటేల్‌ (సి)రియాన్‌ పరాగ్‌ (బి)అశ్విన్‌ 15, రిషబ్‌ పంత్‌ (సి)బౌల్ట్‌ (బి)చాహల్‌ 15, స్టబ్స్‌ (ఎల్‌బి)సందీప్‌ శర్మ 41, నబి (సి)అశ్విన్‌ (బి)బౌల్ట్‌ 19, సలామ్‌ (రనౌట్‌)దూబే/సంజు 9, కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 5, అదనం 1. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 221పరుగులు. వికెట్ల పతనం: 1/60, 2/68, 3/110, 4/144, 5/150, 6/195, 7/215, 8/221 బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-1, సందీప్‌ శర్మ 4-0-42-1, ఆవేశ్‌ ఖాన్‌ 2-0-42-0, అశ్విన్‌ 4-0-24-3, పరాగ్‌ 2-0-17-0, చాహల్‌ 4-0-48-1.

➡️