చిరాగ్‌-సాత్విక్‌పైనే ఆశలు

May 13,2024 21:40 #Sports

రేపటి నుంచి థాయ్ లాండ్‌ ఓపెన్‌
బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఒలింపిక్స్‌కు ముందు భారత షట్లర్లు ఆడే చివరి బ్యాడ్మింటన్‌ టోర్నీ ఇదే. ఈ క్రమంలో భారత స్టార్‌ డబుల్స్‌ ఆటగాలు చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ టైటిల్‌ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. టైటిల్‌ నెగ్గిన ఉత్సాహంతో ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావాలని భారత డబుల్స్‌ ధ్వయం ఆశిస్తున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌, ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన హెచ్‌ఎస్‌ ప్రణరుపైనా భారీ ఆశలున్నాయి. అలాగే కిరణ్‌ జార్జి, సతీష్‌ కుమార్‌, లక్ష్యసేన్‌తోపాటు మహిళల సింగిల్స్‌లో పివి సింధు ఈ టోర్నీకి దూరం కావడంతో అస్మిత్‌ ఛాలీహా సింగిల్స్‌ బరిలో నిలిచింది. కిరణ్‌ తొలి రౌండ్‌లో చైనాకు చెందిన వెంగ్‌-హాంగ్‌-యంగ్‌తో, సతీష్‌ క్వాలిఫయర్‌తో తలపడనున్నారు. ఇక మహిళల డబుల్స్‌లో 4వ సీడ్‌ భారత షట్లర్లు తానీషా కాస్ట్రో,-అశ్విని పొన్నప్ప బరిలోకి దిగనున్నారు.

➡️