రాహుల్‌పైనే ఆశలు

Dec 26,2023 22:15 #Sports

బ్యాటింగ్‌లో రాణించిన కోహ్లి, శ్రేయస్‌

దక్షిణాఫ్రికాతో తొలిటెస్ట్‌భారత్‌ 208/8

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కెఎల్‌ రాహుల్‌ అర్ధసెంచరీకి తోడు విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా రాణించడంతో భారతజట్టు 8వికెట్ల నష్టానికి 208పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే కష్టాల్లోపడింది. 11.1 ఓవర్లలో 24పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌(17), రోహిత్‌ శర్మ(5) తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేరగా.. శుభ్‌మన్‌ గిల్‌(2)ను బర్గర్‌ ఔట్‌ చేశాడు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై రబాడ సఫారీలకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. రోహిత్‌ను వెనక్కి పంపాడు. ఆ కాసేటపికే యశస్వీని బర్గర్‌ ఔట్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడిన భారత్‌ను విరాట్‌ కోహ్లీ(4), గిల్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, బర్గర్‌ సూపర్‌ డెలివరీతో గిల్‌ను ఔట్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్‌ సాధించింది. వికెట్‌ కీపర్‌ కెఎల్‌ రాహుల్‌(70బ్యాటింగ్‌) అర్ధసెంచరీతో ఆదుకున్నారు.. అశ్విన్‌(8) నిరాశపరిచినా.. శార్దూల్‌(24)తో కలిసి కెఎల్‌ రాహుల్‌ 7వ వికెట్‌కు 43పరుగులు జతచేశాడు. బుమ్రా(1)ను జెన్సన్‌ ఔట్‌ చేయడంతో టీమిండియా తొలిరోజే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. సిరాజ్‌(0బ్యాటింగ్‌) కెఎల్‌ రాహుల్‌ కలిసి చివర్లో సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో టీమిండియా తొలిరోజు వెలుతురులేమి కారణంగా ఆటనిలిచే సమయానికి 59ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 208పరుగులు చేసింది. రబడాకు ఐదు, బర్గర్‌కు రెండు, జెన్సన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఆదుకున్న కోహ్లి, శ్రేయస్‌24పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను విరాట్‌ కోహ్లి(38), శ్రేయస్‌ అయ్యర్‌(31) ఆదుకున్నారు. వీరిద్దరూ 4 వికెట్‌కు 68పరుగులు జతచేశారు. తొలుత ఆచి తూచి ఆడినా.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. శ్రేయస్‌ ధాటిగా ఆడగా.. విరాట్‌ నెమ్మదిగా ఆడాడు. వీరు క్రీజ్‌లో నిలదొక్కుకోవడంతో లంచ్‌ విరామానికి టీమిండియా 26ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 91పరుగులు చేసింది. లంచ్‌ తర్వాత రబడా వేసిన ఓ గుడ్‌లెంగ్త్‌ బంతికి శ్రేయస్‌ 31పరుగుల వద్ద బౌల్డ్‌ అయ్యాడు. దీంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

స్కోర్‌బోర్డు.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)వెర్రియనే (బి)బర్గర్‌ 17, రోహిత్‌ శర్మ (సి)బర్గర్‌ (బి)రబడా 5, శుభ్‌మన్‌ (సి)వెర్రెయనె (బి)బర్గర్‌ 2, కోహ్లి (సి)వెర్రెయనె (బి)రబడా 38, శ్రేయస్‌ (బి)రబడా 31, కెఎల్‌ రాహుల్‌ (బ్యాటింగ్‌) 70, అశ్విన్‌ (సి)ముల్డర్‌ (బి)రబడా 8, శార్దూల్‌ (సి)ఎల్గర్‌ (బి)రబడా 24, బుమ్రా (సి)జెన్సన్‌ 1, సిరాజ్‌ (బ్యాటింగ్‌) 0, అదనం 12. (59ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 208పరుగులు.

వికెట్ల పతనం: 1/13, 2/23, 3/24, 4/92, 5/107, 6/121, 7/164, 8/191

బౌలింగ్‌: రబడా 17-3-44-5, జెన్సన్‌ 15-1-52-1, బర్గర్‌ 15-4-40-2, కొర్ట్జే 12-1-53-0

 

➡️