థామస్‌, ఉబెర్‌ కప్‌లో భారత్‌ శుభారంభం

Apr 28,2024 00:06 #Sports

ప్రతిష్ఠాత్మక థామస్‌, ఉబెర్‌ కప్‌లలో భారతజట్లు శుభారంభం చేశాయి. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్‌-సిలో థాయ్ లాండ్‌పై, ఉబెర్‌ కప్‌లో మహిళల జట్టు కెనడాపై సునాయాసంగా విజయం సాధించింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌-1లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు 20-22, 14-21తో విదిత్‌ శరణ్‌(థారులాండ్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌-సాత్విక్‌ జంట 21-19, 19-21, 21-12తో సుఫ్రమ్‌-తీరరస్టకుల్‌పై గెలిచారు. దీంతో స్కోర్‌ 1-1తో సమమైంది. ఆ తర్వాత సింగిల్స్‌-2లో లక్ష్యసేన్‌ 21-12, 19-21, 21-16తో తీరరస్టుకుల్‌పై గెలిచి భారత్‌కు 2-1 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-దృవ్‌ కపిల 21-19, 21-15తో, మూడో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-9, 21-5తో శరణ్‌ జస్రీని చిత్తుచేయడంతో భారత్‌ 4-1తో విజయం సాధించింది. 29న భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో, మే 1న ఇండోనేషియాతో తలపడనుంది.
ఉబెర్‌ కప్‌లోనూ సునాయాసంగా..
ఉబెర్‌కప్‌లోనూ భారత్‌ సునాయాసంగానే కెనడాను చిత్తుచేసింది. గ్రూప్‌ాఎలో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్‌ అస్మిత చాలీహా 26-24, 24-22తో స్టార్‌ షట్లర్‌ మిఛ్చెలిని చిత్తుచేసి భారత్‌కు 1-0 ఆధిక్యతలో నిలిపింది. మహిళల డబుల్స్‌లో ప్రియాస్మృతి 21-12, 21-10తో, రెండో సింగిల్స్‌లో ఈషారాణి 21-13, 21-12తో వెన్‌ యును చిత్తుచేసి భారత్‌కు 3ా0 ఆధిక్యతలో నిలిపారు. మహిళల రెండో డబుల్స్‌లో సిమ్రన్‌ సింఘిారితిక 19-21, 15-21తో ఓటమిపాలవ్వగా.. మూడో, చివరి సింగిల్స్‌లో అన్మోల్‌ కర్బ్‌ 21-15, 21-11తో ఎలీనా జంగ్‌పై గెలిచి భారత్‌కు 4-1 ఆధిక్యతను చేకూర్చారు. నేడు ఉబెర్‌ కప్‌లో మహిళల జట్టు సింగపూర్‌తో తలపడనుంది. 30న చైనాతో తలపడనుంది.

➡️