క్వార్టర్స్‌కు జకో, రుబ్లేవ్‌

Jan 22,2024 10:28 #Sports

సిట్సిపాస్‌ ఔట్‌..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో సెర్బియాకు చెందిన జకోవిచ్‌ 6-0, 6-0, 6-3తో 20వ సీడ్‌ మన్నారివో(ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఇతర ప్రి క్వార్టర్స్‌ పోటీల్లో 4వ సీడ్‌ సిన్నర్‌, 5వ సీడ్‌ రుబ్లేవ్‌ ప్రత్యర్థులను చిత్తుచేయగా.. 7వ సీడ్‌ సిట్సిపాస్‌ అన్యూహ్యంగా ప్రి క్వార్టర్స్‌ను ఓటమిపాలయ్యాడు. సిట్సిపాస్‌ 6-7(3-7), 7-5, 3-6, 3-6తో 12వ సీడ్‌ టి. ప్రిట్జ్‌(అమెరికా) చేతిలో ఓడాడు. ఇక సిన్నర్‌(ఇటలీ) 6-4, 7-5, 6-3తో 15వ సీడ్‌ ఖచనోవ్‌(రష్యా), 5వ సీడ్‌ రుబ్లేవ్‌(రష్యా) 6-4, 6-7(5-7), 6-7(4-7), 6-3, 6-0తో 10వ సీడ్‌ డి-మినర్‌(ఆస్ట్రేలియా)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు. క్రేజికోవా, సబలెంకా కూడా..మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి 2వ సీడ్‌ సబలెంకా(రష్యా), 9వ సీడ్‌ క్రేజికోవా(చెక్‌) ప్రవేశించారు. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీల్లో సబలెంకా 6-3, 6-2తో అనిసిమోవా(అమెరికా), క్రేజికోవా 4-6, 6-3, 6-2తో ఆండ్రివా(రష్యా)ను చిత్తుచేశారు. మరో పోటీలో 4వ సీడ్‌ కోకా గాఫ్‌(అమెరికా) 6-1, 6-2తో ఎం. ఫ్రెచ్‌(పోలండ్‌), ఎం కోస్ట్యుక్‌(ఉక్రెయిన్‌) 6-2, 6-1తో మరియా టిమోఫివా(రష్యా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌కు చేరారు.

➡️