ఆటకు మొమొటో అల్విదా

Apr 18,2024 22:25 #Badminton, #Sports

టోక్యో: జపాన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కెంటో మెమొటా ఆటకు వీడ్కోలు పలికాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించడంలో విఫలమైన మెమొటా గురువారం బ్యాడ్మింటన్‌లో తన సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలుతున్నట్లు వెల్లడించాడు. ‘తాను ఎంతగా ప్రయత్నించినా మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, భవిష్యత్తులో మళ్లీ వరల్డ్‌ నంబర్‌వన్‌ కాలేనని తెలిపాడు. ఇటీవల కంటికి సర్జరీ కూడా జరిగిందని, గతంలో మాదిరిగా కోర్టులో హుషారుగా కదలేకపోతున్నా. ఈ పరిస్థితులనుంచి బయటపడేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నాడు. ఈ క్రమంలో తాను భవిష్యత్తులో బ్యాడ్మింటన్‌ ఆడలేననే విషయాన్ని గ్రహించాను’ అని వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నాడు. జపాన్‌ తరఫున బ్యాడ్మింటన్‌లో రికార్డులు బద్ధలు కొట్టిన మెమొటా 2018-19లో ఎన్నో టైటిళ్లు సాధించాడు. వరల్డ్‌ చాంపియన్‌షిష్‌ టైటిల్‌తో పాటు ఏకంగా 11 ట్రోఫీలు సాధించాడు. 2020 జనవరిలో కారు ప్రమాదం అతడి కెరీర్‌పై ప్రభావం చూపలేకపోయింది. అనంతరం మూడు టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో జపాన్‌ జట్టు థామస్‌కప్‌లో మెమొటా లేకుండానే బరిలోకి దిగుతోంది.

➡️