టీ20 వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

Apr 29,2024 17:43 #Cricket, #Sports, #T20, #World Cup

ప్రపంచ కప్‌ కోసం టీమ్‌లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌ తమ స్క్వాడ్‌ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా జట్టును కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌, ప్రధాన కోచ్‌ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తుంటారు. కానీ, కివీస్‌ బోర్డు మాత్రం వినూత్నంగా ఇద్దరు చిన్నారులతో ప్రత్యేకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. వారితో జట్టు సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ”అందరికీ హారు. మేం ఇక్కడికి వచ్చింది వరల్డ్‌ కప్‌ జట్టును ప్రకటించడానికే. ఇలాంటి అవకాశం రావడం అనందంగా ఉంది. యూఎస్‌ఏ – విండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ కోసం కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ను ఎంచుకున్నాం” అని వీడియోలో ఆంగస్‌, మటిల్దా పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌ టీమ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మైకెల్‌ బ్రాస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేవన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌ సాంట్నర్‌, ఐష్‌ సోధి, టిమ్‌ సౌథి. ట్రావెలింగ్‌ రిజర్వ్‌: బెన్‌ సీర్స్‌

➡️