అత్యంత కీలక మ్యాచ్‌ నుంచి పంత్‌ సస్పెండ్‌

May 12,2024 17:40 #2024 ipl, #Cricket

ఐపీఎల్‌ 2024 సీజన్‌లోని రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన 56వ మ్యాచులో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్‌ కు షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కు ఇప్పటికే రెండు సార్లు జరిమానా విధించిన బీసీసీఐ తాజాగా మరోసారి అలాగే జరగడంతో అతనికి 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో ఈ రోజు బెంగుళూరుతో జరిగే అత్యంత కీలకమైన మ్యాచులో పంత్‌ ఆడటం లేదు. కాగా ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ప్లే ఆఫ్‌ చేరేందుకు అత్యంత కీలకం కావడం విశేషం.

➡️