ఎన్నికల కోసగమే పగటి వేషాలు : ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి

          అనంతఅనంతపురం : ఎన్నికలు వస్తున్నాయని తెలిసే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా జనం వద్దకు వస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం రంగస్వామి నగర్‌లో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా చేపట్టిన అభివద్ధి పనులకు సంబంధించి బోర్డు, వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేదల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరంను నిర్వీర్యం చేసి, పట్టిసీమ పేరుతో డ్రామాలు ఆడారన్నారు. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని చెప్పారు. అలాంటి వాలంటీర్లను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు చేయడం దుర్మార్గమన్నారు. అనంతపురం నగరంలో సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల రూ.800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు గతంలో చంద్రబాబు పాలనకు.. ఇప్పుడు జగన్‌ పాలనకు మధ్య తేడాను గమనించి మరోసారి వైసీపీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ వీరా రామకృష్ణారెడ్డి, పార్టీ క్లస్టర్‌ కన్వీనర్‌ రమణారెడ్డి, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌ రెడ్డి, కార్యదర్శి రాధాకష్ణా, కార్పొరేటర్లు దుర్గాదేవి, శ్రీనివాసులు, టివి చంద్రమోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు రామచంద్ర, పాన్‌ సాధిక్‌, పెట్రోల్‌ వెంకటరాముడు, పుల్లన్న, నాగరాజు, లక్ష్మీనారాయణ, అబూబకర్‌ పాల్గొన్నారు.

➡️