జగనన్న ఆరోగ్యసురక్ష పేదలకు వరం

Jan 5,2024 21:28

ప్రజాశక్తి-కలికిరి జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరంలాంటిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్య నిర్వాహక అధికారి డికె.బాలాజీ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత అమలు పరిశీలనలో భాగంగా మండలంలోని మెడికుర్తి పిహెచ్‌సి పరిధిలో కలికిరి-1 సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన క్యాంప్‌ నిర్వహణ, రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తున్నారు, కెషీట్‌ డౌన్‌లోడ్‌ ఎలా జరుగుతుంది, స్పెషలిస్ట్‌ డాకర్లు ఎంతమంది హజరయ్యారో పరిశీలించారు. యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అని ఆరోగ్యమిత్ర, ఎఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగు కార్యక్ర మంలో లబ్ధిదారులకు కంటి అద్దాల పంపిణీని యాప్‌లో పరిశీలించారు. డ్రగ్‌ కౌంటర్‌ను, ల్యాబ్‌ పరిశీలించి ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని మందులు ఉన్నాయా, పరీక్షలు అన్నీ చేస్తున్నారా అని విచారించి లబ్ధిదారులను అడిగి తెకుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం నూతన ఆరోగ్య శ్రీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు మెమోం టోను అందించి దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, డి.సి.డాక్టర్‌ లోకవర్ధన్‌, ఎంపిడిఒ గంగయ్య, మెడికుర్తి వైద్యులు డాక్టర్‌ చిన్నరెడ్డెప్ప, స్పెషలిస్ట్‌ వైద్యులు డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ సోమశేఖర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, టీమ్‌ లీడర్‌ జాకావుల్లా, జడ్‌పిటిసి పద్మజ, ఎంపిపి నూర్జహాన్‌ ,వైద్యసిబ్బంది పాల్గొన్నారు.వాల్మీకిపురం: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని, ఇంటి వద్దకే వైద్య సేవలు అందజే స్తుందని సర్పంచ్‌ గంగులమ్మ, ఉప సర్పంచ్‌ కేశవరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాల యంలో రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ కీర్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కలకడ: మండలంలోని ఎనుకొండపాలెం పంచాయితీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌, ఎంంపిడిఒ పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించినట్లు డాక్టర్‌ జవహర్‌బాబు తెలిపారు. సుమారు 312 మంది రోగులను పరీక్షించి మందులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి ఈశ్వరయ్య, మండల సచివాలయం కన్వీనర్‌ మోహన్‌ రాజానాయుడు, ఎంపిహెచ్‌ఒ జయరామయ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పీలేరు: కెవిపల్లి మండలం, తువ్వపల్లిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్యనిర్వహణాధికారి డికె బాలజీ తనిఖీ చేశారు. వైద్య శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందడం పట్ల ఆయన సంతప్తిని వ్యక్తం చేశారు. అనంతరం క్యాంప్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ లోకవర్ధన్‌, డిఐఒ డాక్టర్‌ ఉషశ్రీ, వైద్యులు డాక్టర్‌ పావన గౌరి, డాక్టర్‌ హరి, ఎంపిడిఒ ఉపేంద్ర, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, టీమ్‌ లీడర్‌ జాకాఉల్లా, వైసిపి నాయకులు గజ్జల శీనురెడ్డి, ఆనందరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నిమ్మనపల్లి: మండలంలోని రెడ్డివారిపల్లి సచివాలయం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్‌ రెడ్డమ్మ నరేంద్రరెడ్డి, వైసిపి నాయకులు నరేంద్రరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్‌ రామమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు, ఎంపిడిఒ శేషగిరిరావు ప్రారంభిం చారు. 301 మంది జగనన్న ఆరోగ్య సురక్షలో వైద్య పరీక్షలు చేయించుకోగా, అందులో 82 మందికి ల్యాబ్‌ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ రామానుజులు, డాక్టర్‌ మహతి, పంచాయతీ కార్యదర్శి మారెప్ప, ఎర్రమల్లయ్య నాయుడు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: జగనన్న ఆరోగ్య సురక్షను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌లు శ్యామలమ్మ, జ్యోతి, ఎంపిటిసి మహేష్‌లు పేర్కొన్నారు. శుక్రవారం కన్నెమడుగు ఆరోగ్య ఉప కేంద్రంలో రెండవ విడత జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ మునికుమార్‌, డాక్టర్‌ తేజశ్రీ, ఎంపిడిఒ సురేంద్రనాథ్‌, ఆశ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️