పెట్లూరులో సాగు భూములకు పట్టాలివ్వాలి

పెట్లూరులో సాగు భూములకు పట్టాలివ్వాలి

పెట్లూరులో సాగు భూములకు పట్టాలివ్వాలిప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరు గ్రామంలో సర్వే నంబరు 12(1)లో వ్యవసాయ కూలీలు గత 20 సంవత్సరాలుగా చెట్టు తొలగించుకుని సాగుకు సన్నద్ధమవుతుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సరి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. ఎంతోమంది నిరుపేద వ్యవసాయ కూలీలు సెంటు పొలం లేక అనేక పర్యాయాలు ప్రభుత్వానికి పట్టాలు ఇప్పించమని విన్నవించుకున్నా ప్రయోజనం లేదన్నారు. వీరికి ఎర్రజెండా అండగా ఉంటుదని, పట్టాలు ఇచ్చేంత వరకూ పోరాడతామన్నారు. పేదవారికి ఎకరా భూమి ఇస్తే సాగు చేసుకుని పిడికెడు అన్నం తినే అవకాశం ఉంటుందన్నారు. అపుడు ఉచిత పథకాలు ఆశించరన్నారు. లబ్దిదారులకు రెండు ఎకరాల చొప్పున భూములను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌రెడ్డి అదే సర్వే నంబర్‌లో జగన్న ఇళ్ల నిర్మాణం చేపడితే ఫారెస్టు అధికారులకు కనిపించదని, అదే పేదవాడు సాగు చేసుకుంటుంటే ఎలా అడ్డుకుంటారన్నారు. పేదలకు భూములు పంచేంత వరకూ ఎర్రజెండా వారికి అండగా ఉంటుందన్నారు.

➡️