బంద్‌ను జయప్రదం చేయాలి

మాట్లాడుతున్న కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి-పెదబయలు:గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీఓ 3కు చట్టబద్దతకు ఆర్డినెన్స్‌, ఆదివాసులకు 100 శాతం ఉద్యోగాలని ఈనెల 10న చేపడుతున్న మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,జిసీసీ అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ కార్యదర్శి కె.శర్బన్న, అద్యక్షులు బి.గంగాధర్‌, నాయకులు కె,.బుజ్జిబాబు. కె.నీలకంఠం పాల్గొన్నారు. అరకులోయ రూరల్‌:జిఓ 3 పునరుద్దరణ చేసి ఆదివాసీ ప్రాంతంలో 100శాత ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి.బుజ్జిబాబు అధ్యక్షతన గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ఆదివాసీ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలదేవ్‌ మాట్లాడుతూ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ అవకాశాలు ఆదివాసులకు ఇవ్వాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి ధనుంజరు, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు సింహాచలం, యుటిఎఫ్‌ మండల కార్యదర్శి విజరు కుమార్‌, సచివాలయం ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మత్య్సరాజు, మాతృ బహుభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు నాగేంద్ర, డిగ్రీ కాలేజ్‌ ఫ్యాకల్టీ లెక్చరర్ల సంఘం నాయకులు డాక్టర్‌ సుభాన్‌, ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ కోకన్వీనర్‌ ఉపేంద్ర,ఆదివాసి కాఫీ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ జి చిన్న బాబు మాట్లడుతూ, ఆదివాసి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు గిరిజనేతరులకు కల్పించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు జగన్నాథం, కోగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఐసుబాబు, డిఎల్‌ఓ జిల్లా నాయకులు కొర్ర ప్రసన్నకుమార్‌, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు పి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.10న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలి సీలేరు : జిఒ నెంబర్‌ 3ను పునరుద్ధరించి ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకు కేటాయించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఈనెల 10న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని గాలికొండ ఎంపీటీసీ ఎ.బుజ్జిబాబు పిలుపునిచ్చారు. జీకే వీధి మండలం గాలికొండలో గురువారం బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు.

➡️