మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటదాసు 

మాచర్ల్ల: మాచర్ల మున్సిపల్‌ కమిషనర్‌గా డి . వెంకటదాసు బుధవారం సాయంత్రం పదవీ బాధ్య తలు చేపట్టారు. నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తూ బదిలీపై మాచర్ల కమి షనర్‌గా వచ్చారు. ఇప్పటి వరకు పనిచేసిన కమి షనర్‌ ఇవి రమణబాబు నెల్లూరు జిల్లా బుచ్చి రడ్డిపాలెంకు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం రమణబాబు, వెంకటదాసు కలిసి కార్యాలయంలోని పలు విభాగాలను, మాచర్ల టౌన్‌కు మంచినీరు సరఫరా చేసే పంప్‌హౌస్‌ను పరిశీలించారు. వీరు ఇరువురిని ప్రభుత్వ వైద్యులు అరుణ్‌ కుమార్‌, ప్రవీణ్‌లు ఘనంగా సన్మానించారు.

➡️