మూల్యం చెల్లించక తప్పదు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ బకాయిలు చెల్లించకుంటే మూల్యం చెల్లించక తప్పదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్‌ , అధ్యక్షులు హరిప్రసాద్‌ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం 12 గంటలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎ, పిఆర్‌సి అరియర్లు, పిఎఫ్‌ రుణాలు, ఎపి జిఎల్‌ఐ మొత్తం కలిపి సుమారు రూ. 19 వేల కోట్ల ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతినెలా 1న వేతనాలు చెల్లించాలని, 12వ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. అంతవరకు 30 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని, మునుపటి పిఆర్‌సి బకాయులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌, జిపిఎస్‌ అనేటువంటివి చాలా దుర్మార్గమైనటువంటివని అన్నారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పాడని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. ధర్నాకు సిఐటియు, ఎఐటియుసిి, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, మైనారిటీ హక్కుల పరిరక్షణ వేదిక వంటి ప్రజా సంఘాలు, ఎస్‌టియు, పిఎస్‌టియు తదితర ఉపాధ్యాయ సంఘాలు,తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం సావిత్రి భారు ఫస్త్రలే జయంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్‌ నాయుడు, మహిళా అధ్యక్షురాలు హేమలత, జిల్లా సహా అధ్యక్షులు శివారెడ్డి,జిల్లా ఆర్థిక కార్యదర్శి చంద్రశేఖర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ చెంగల్‌ రాజు , జిల్లా కార్యదర్శులు పురం వెంకటరమణ, వెంకటసుబ్బయ్య, రమణమూర్తి, దావుద్దీన్‌, అక్రంబాష , జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి ఆడిట్‌ కమిటీ సభ్యులు విశ్వనాథరెడ్డి నాయకులు రాజా రమేష్‌, చంద్రశేఖర్‌ ,హఫీజిల్లా, సుధాకర్‌ ,నాగేంద్ర, రమేష్‌, ఉదయ భాస్కర్‌, తిరుపతి, అంజాద్‌, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️