సమస్యలు తక్షణమే పరిష్కరించాలి : ఎస్‌పి

Dec 11,2023 20:47

పార్వతీపురంరూరల్‌ : ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నేరుగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేధింపులు, కుటుంబ కలహాలు, సివిల్‌ తగాదాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదే పదే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్దితులు ఉండకూడదని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో 13 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఎస్‌పి తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌పి ఒ.దిలీప్‌ కిరణ్‌, ఎస్బి సిఐ సిహెచ్‌. లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకర్రావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️