సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే పోటీలు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘రోల్‌ ఆఫ్‌ రోబోటిక్‌ టెక్నాలజీ ఇన్‌ ఫ్యూచర్‌ (డే టుడే లైఫ్‌) ఊహాజనిత చిత్రం’ పై డ్రాయింగ్‌ పోటీలు కడప విద్యాసాగర్‌ ఆస్పత్రి, విద్యాసాగర్‌ ఆర్థరైటిస్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాలాజీ నగర్‌లో ఉన్న ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. ప్రముఖ మోకాళ్ల కీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్‌ విద్యాసాగర్‌ రెడ్డి, షుగర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ శ్రీ లక్ష్మి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మక శక్తిని వెలికి తీయడానికి రోబోటిక్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. టెక్నాలజీ ప్రపంచంలో దినదినాభివద్ధి చెందుతూ ముందుకు వెళుతుందని తెలిపారు. భారతదేశంలో కూడా టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఎలాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు అని విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించాలని చెప్పారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.7 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, తతీయ బహుమతి రూ.3 వేలు, ఒకొక్కరికి రూ. వెయ్యి చొప్పున ఐదుగురికి కన్సోలేషన్‌ బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీలకు జిల్లాలోని సుదీర్ఘ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లను ప్రదానం చేశామని, విజేతలుగా నిలిచిన వారికి త్వరలో బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.వీర సుదర్శన్‌ రెడ్డి, వైవీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చిన్న రాయుడు, వీరప్ప, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్‌ బాబు, నాయకులు కష్ణారెడ్డి, రంగనాయకులు, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ఎల్లెశ్వరరావు, ఉషా తులసి, సుబ్బారెడ్డి, జెవివి నాయకులు కరీముల్లా, వివిధ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️