మహిళల ఓట్ల కోసం గాలం

May 6,2024 12:27

ప్రజాశక్తి -కాళ్ళ
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కు ఇంకా ఏడు రోజులే సమయం ఉంది. ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఎంత నిఘా పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ,అభ్యర్థులు ప్రచారానికి భారీగా ఖర్చు చేయడంతో పాటు ఓటర్లకు రకరకాల తాయిలాలు ఇస్తారన్నదిహొ బహిరంగ రహస్యమే. అయితే ఎంత ఖర్చు చేసినా, ఎవరెవరికి ఎంత డబ్బు పంచినా, చివరికి వారంతా ఓట్లు వేస్తారో, లేదోనన్న ఆందోళన అభ్యర్డులను వెంటాడుతోంది. పోటీ చేసే అభ్యర్థులు మహిళా ఓటర్లను ఎక్కువగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనాభా, ఓటర్లలో మహిళలదే పై చేయి. రాజకీయంగా కూడా వారిదే సగం వాటా. ఈసారి మహిళా ఓటర్ల శాతం ఘననీయంగా ఉండటంతో రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలలో మహిళా సంక్షేమానికి ప్రధాన్యం ఇచ్చాయి. వారి ఓట్లను గాలం వేయడానికి ప్రధాన రాజకీయ పార్టీలు వారికి ఎన్నో పథకాలను వర్తించేలా మేనిఫెస్టోలను రూపొందించుకున్నాయి.జిల్లాల విభజన అనంతరం పశ్చిమగోదావరిజిల్లా 2022 ఏప్రియల్‌ 4న ఏర్పడినప్పుడు 2011 లెక్కల ప్రకారం 19 మండలాల్లో జనాభా 17,80,321మంది. మొత్తం జనాభా 17,80,321మంది. ఇందులో మహిళలు 11,200మంది అధికంగా ఉన్నారు. 2024 జనవరి 22న ప్రకటించిన తుది ఓటర్ల జనాభా ప్రకారం జిల్లాలో ఓటర్లు 7,44,308మంది నమోదయ్యారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గంలో భీమవరంలో అత్యధికంగా మహిళ ఓటర్లు ఉండగా నరసాపురంలో అత్యల్ఫం. ఏలూరు జిల్లాలో ఓటర్ల తుది జాబితా ఆధారంగా మొత్తం ఓటర్లు 16,24,416మంది కాగా పురుష ఓటర్లు 7,93,897మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 8,30,390మంది ఉన్నారు. జిల్లాలో మహిళ ఓటర్లు 36,493,, మంది అధికంగా ఉన్నారు.ఉమ్మడి జిల్లాలో కూడా పురుషుల కంటే మహిళలే అధికం.మహిళల ఓట్లే నమ్మకంగా పడతాయనే ఉద్దేశ్యంతోహొ వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మహిళ ఓట్లను తమ వైపు తిప్పుకొంటే. కుటుంబంలోని ఓటర్ల వచ్చేందుకు అవకాశముటుందని కూడాహొ యోచిస్తున్నారు. అందుకే పలు నియోజకవర్గంలో వైసీపీ, టిడిపి పార్టీలు అభ్యర్థులు ప్రత్యేకించిహొ మహిళ ఓటర్లను, కీలకంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలపై గురిపెట్టారు. వారికీ ఆయా గ్రూప్‌ల వారీగా డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని డ్వాక్రా, ఇతర సంఘాల్లో ఉండే మహిళల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక టీమ్‌ లను ఏర్పాటు చేసుకున్నారు.ఆటీమ్‌లు కీలకమైన సంఘాల వివరాలతో పాటు ఆ గ్రూప్‌లోని మహిళల ఫోన్‌ నెంబర్లు సేకరిస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిక శాతం ఓట్లు తమ పార్టీకే వేసేలా పార్టీలు నిమగమయ్యాయి. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇప్పటికే చీరలు పంచారు. నియోజకవర్గంలోని అన్నిప్రాంతాల్లో డ్వాక్రా సంఘ సభ్యులకు నగదు పంపిణీ మొదలైనట్లు సమాచారం. ఒక్కో బ్యాలెట్‌ ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అధికార, ప్రతిపక్ష పార్టీలు పంపిణీ చేస్తున్నారు. మహిళల ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతయో మరి వేసి చూడాల్సిందే.

➡️