రైతు జీవితం ఓ చిత్రవధ

Feb 19,2024 11:00 #cartoon, #Farmer, #Life

లోకానికి

అన్నం పెట్టేవాడు

ఆకలితో వీధి కాళ్లు పట్టుకున్నాడు.

పొలాన్ని ఏలే రాజు

ఆత్మ గౌరవం

పాలకుల వంచనకు బలైంది.

మట్టిని చెమటతో తడిపి

బంగారాన్ని పండించిన చేతులకు

సంకెళ్లు వేశారు.

సమస్త సంతోషాలకు

మూలమైన జీవితాలు

అనాధలుగా మారాయి

దేశానికి వెన్నుముకైన

రైతు జీవితాన్నిఓ ప్రశ్నగా మార్చి చిత్రవధ చేస్తున్నారు!

–  చందలూరి నారాయణరావు 97044 37247

➡️