ప్రోలీసుల కవాతు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ

గామాల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- రణస్థలం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించు కోవాలని ఎస్‌ఐ కె.గోవిందరావు అన్నారు. ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఆదేశాల మేరకు మండలంలోని రణస్థలం, రావాడ గ్రామాల్లో ఎస్‌ఐ ఆధ్వర్యంలో రాజస్థాన్‌ స్టేట్‌ స్పెషల్‌ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు భద్రత కల్పిస్తారనే ఆలోచన ప్రజల్లో కల్పించే ఉద్దేశంతో కవాతు నిర్వహిం చినట్లు తెలిపారు. ఎన్నికలకు అంతరాయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కావవద్దని సూచించారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల పహారా పెంచామని తెలిపారు.

 

➡️